ఈసీతో తేల్చుకునేందుకు ఢిల్లీకి చంద్రబాబు..!

ఈసీతో తేల్చుకునేందుకు ఢిల్లీకి చంద్రబాబు..!

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును వారి దృష్టికి తీసుకురానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా, ఇతర కమిషనర్లను ఆయన కలవనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీల గుర్తు మారడం, సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను సీఈసీకి దృష్టికి తీసుకెళ్లి నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఈసీని కలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.