9న నెల్లూరుకు సీఎం చంద్రబాబు

9న నెల్లూరుకు సీఎం చంద్రబాబు

ఈ నెల 9వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నగర సమీపంలోని వెంకటేశ్వరపురంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్లను  ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి కాలనీలోని ఏర్పాట్లను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగిలు పరిశీలించారు.