ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న బాబు

ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న బాబు

సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఇవాళ శ్రీకాకుళంలో పర్యటించనున్న ఆయన... ఎన్నికల శంఖారావం సభలో పాల్గొననున్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం గ్రౌండ్స్ వేదికగా ఎన్నికల శంఖారావ సభ నిర్వహిణకు భారీ ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు. ఓవైపు అభ్యర్థులను ప్రకటించి.. మిగతా అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తూనే ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు టీడీపీ అధినేత.