నేడు చిత్తూరులో సీఎం పర్యటన..

నేడు చిత్తూరులో సీఎం పర్యటన..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు... ఇవాళ తన జిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జలహారతితో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద హంద్రీ జలాలకు జల హారతి ఇవ్వనున్న ఏపీ సీఎం.. అనంతరం మదనపల్లిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలలో హంద్రీ జలాలకు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. తన పర్యటనలో తిరుపతిలో అరబిందో కంటి ఆస్పత్రిని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక తిరుపతిలో నిర్మించనున్న ఎలివేటర్ ప్లై ఓవర్ కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.