లక్నో బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు

లక్నో బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు

రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం లక్నోకు బయలుదేరారు. సాయంత్రం 5గంటలకు బీఎస్పీ చీఫ్ మాయావతిని కలువనున్నారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో కూడా భేటీ అవుతారని సమాచారం. ఎన్డీయే యేతర కూటమి బలోపేతానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిన చంద్రబాబు ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. గంట పాటు సమావేశమైన సీఎం.. వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక చర్చలు జరిపారు. అనంతరం ఎల్జేడీ నేత శరత్ యాదవ్‌, సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకర్‌ రెడ్డి, డి.రాజాతో భేటీ అయ్యారు.