హస్తినకు చేరుకున్న చంద్రబాబు టీమ్..

హస్తినకు చేరుకున్న చంద్రబాబు టీమ్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళ్లిన చంద్రబాబు బృందం ఢిల్లీ చేరుకుంది... కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా, ఇతర కమిషనర్లను ఆయన కలవనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీల గుర్తు మారడం, సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను సీఈసీకి దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు. ఇక చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి, సీఎం రమేష్, చినరాజప్ప, రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్, కేశినేని నాని,  నక్కా ఆనంద బాబు, నారాయణరావు, అశోక్ గజపతి రాజు, రామ్మోహన్ నాయుడు, శివ ప్రసాద్, మాల్యాద్రి, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఆచారం నాయుడు, కాలవ శ్రీనివాస రావు తదితర నేతలతో కూటిన చంద్రబాబు టీమ్ ఈసీని కలవనుంది.