సోనియా గాంధీతో చంద్రబాబు భేటీ..?

సోనియా గాంధీతో చంద్రబాబు భేటీ..?

“తృతీయ రాజకీయ శక్తి” ఏర్పాటు దశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... కేంద్రంలో లౌకిక శక్తుల కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికే శనివారం రోజు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమైన చంద్రబాబు... ఇవాళ్ ఉదయం 10 గంటలకు మరోసారి రాహుల్ గాంధీతో భేటీకానున్నారు. ఈ పర్యటనలో వరుసగా రెండు సార్లు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కావడం విశేషం. శనివారం లక్నోలో యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేష్ యాదవ్‌తో జరిపిన చర్చలు వివరాలను రాహుల్ గాంధీతో విశ్లేషించనున్నారు చంద్రబాబు. అయితే, వీలును బట్టి ఇవాళ ఉదయం సోనియాగాంధీతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కానట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రానికి చంద్రబాబు.. అమరావతికి చేరుకోనున్నారు.