పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ..

పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ..

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖరాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో డిమాండ్ చేశారాయన. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు తమ హక్కు అని పేర్కొన్న ఏపీ సీఎం... విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా... వివిధ పెండింగ్ అంశాలపై కేంద్రానికి లేఖలు రాస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.