మోడీ, అమిత్ షాలపై ఈసీకి చంద్రబాబు లేఖ

మోడీ, అమిత్ షాలపై ఈసీకి చంద్రబాబు లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తరువాత మోడీ బద్రీనాథ్, కేదార్ నాథ్ పర్యటనలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపారు. మోడీ ఆధ్యాత్మిక పర్యటన మీడియా ఛానెల్స్ నిరంతరం ప్రసారం చేయడంతో పలువురు ఓటర్లను ప్రభావితం చేసినట్టేనని లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు.