దీక్ష విరమించిన చంద్రబాబు

దీక్ష విరమించిన చంద్రబాబు

ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష ముగిసింది. చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ. ఉదయం 8 గంటలకు దీక్షకు కూర్చున్న చంద్రబాబు... రాత్రి 8 గంటలు దాటిన తర్వాత దీక్ష విరమించారు. తనతో పాటు దీక్షలో కూర్చున్న ఇతర నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉదయం 8 గంటల నుంచి దాదాపు రాత్రి 8.30 వరకు సుమారు 12.30 గంటల పాటు చంద్రబాబు దీక్ష సాగగా... బీజేపీయేతర పార్టీల నేతలంతా వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఫరూక్ అబ్దులా, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, ములాయం సింగ్.. తదితర నేతలు చంద్రబాబు దీక్షకు సీంఘీభావం తెలిపారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. కేంద్రంపై పోరాటంలో తాము కలిసివస్తామని ప్రకటించారు.