నేడు కొండపల్లి ఖిల్లాకు చంద్రబాబు

నేడు కొండపల్లి ఖిల్లాకు చంద్రబాబు

విజయవాడలోని కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో రెండో రోజు సోమవారం సీఎం చంద్రబాబు హాజరవనున్నారు. సీఎం హాజరవుతారని మంత్రి దేవినేని ఉమా, కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. నిమ్రా కళాశాల వద్ద హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుని, అనంతరం రోడ్లు మార్గంలో ఉదయం 11 గంటలకు ఖిల్లాకు చేరుకోనున్నారు. అక్కడ గంట పాటు జరిగే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.