కేబినెట్‌ ముందు కీలక అంశాలు..

కేబినెట్‌ ముందు కీలక అంశాలు..

సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది... కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చజరుగుతోంది. సంక్షేమ పథ‌కాల‌పై కీల‌క నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్. ఇప్పటికే పెన్షన్ల పెంపుపై ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు... పెన్షన్ల పెంపు నిర్ణయానికి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలపనుంది. డ్వాక్రా సంఘాల‌కు ఒక్కొక్కరికి 10 వేలు ఇచ్చే ప‌థ‌కానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 94 ల‌క్షల మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రూ.9,400 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు రైతుల‌కు కొత్త ప‌థ‌కం అందుబాటులోకి తెచ్చే ఆలోచ‌న‌లో ఉంది ఏపీ సర్కార్. అగ్రిగోల్డ్ వ్యవ‌హారంపై కీల‌క నిర్ణయాలు తీసుకోనుంది. ఆటోల‌కు, ట్రాక్టర్లకు టాక్స్ మిన‌హాయింపుపై కూడా ఇవాళ చర్చంచనున్నారు. చుక్కల భూముల స‌మ‌స్యల‌పై మంత్రి వ‌ర్గంలో చ‌ర్చ సాగనుంది. ప్రభుత్వ సంస్థలు అప్పులు తెచ్చేందుకు అనుమ‌తులు ఇవ్వనుంది ఏపీ కేబినెట్.