అమరావతిలో 'మహానటి' సందడి

అమరావతిలో 'మహానటి' సందడి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.  గుంటూరులో జన్మించిన సావిత్రి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వెళ్లి వెండితెరపై ఓ వెలుగు వెలిగిన మహానటి.  సావిత్రి జీవితం గురించి తీసిన మహానటి సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన సంగతి విదితమే. కాగా, మహానటి టీమ్ అమరావతిలో సందడి చేసింది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానటి టీమ్ ను ఘనంగా సత్కరించారు.  

ఎన్టీఆర్, సావిత్రిల ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  ఇద్దరు కలిసి  క్లాసికల్ హిట్ సినిమాల్లో నటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.  ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ చేసిన పరిశోధన అబ్బురపరిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  సావిత్రి పడిలేచిన కెరటం అని.. ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ అని.. సావిత్రి ఎందరికో స్ఫూర్తి అని బాబు తెలిపారు. సావిత్రి జీవితాన్ని సినిమాగా తీయడం ఓ సాహసం అని, సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారని చెప్పారు.