గ్రూప్-1 టాపర్ కి సీఎం అభినందనలు

గ్రూప్-1 టాపర్ కి సీఎం అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్-1 ఫలితాలు తాజాగా విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్-1లో టాపర్ గా ప్రకాశం జిల్లాకు చెందిన ఏ.వెంకటరత్నం నిలిచాడు. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు టాపర్ వెంకటరత్నంను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోను టీడీపీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.