శ్రీవారిని దర్శించుకున్న ఏపీ,కర్ణాటక సీఎంలు..!

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ,కర్ణాటక సీఎంలు..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వామి దర్శనానికి విచ్చేసారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కర్ణాటక సీఎం కు మహాద్వారం ప్రవేశ మార్గం దగ్గర స్వాగతం పలికారు. జగన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరువురు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.  తరవాత జగన్ తో కలిసి యడ్యూరప్ప ఆలయం ఎదుట ఉన్న నాదనీరాజనంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా తదితరులు పాల్గొన్నారు.