ఢిల్లీ చేరుకున్న జగన్, కాసేపట్లో అమిత్ షాతో భేటీ

ఢిల్లీ చేరుకున్న జగన్, కాసేపట్లో అమిత్ షాతో భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీలు కూడా ఢిల్లీకి వచ్చారు. సీఎం జగన్ ఢిల్లీలో రెండు మూడు రోజులు ఉండనున్నట్లు సమాచారం.  సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొంటారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.