చింతపల్లి ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

చింతపల్లి ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం చెరువూరులో జరిగిన ఆటో ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.