ఏపి సీఏం ఢిల్లీ పర్యటన ఖరారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇజ్రాయిల్ పర్యటనను ముగించుకొని ఈరోజు రాత్రికి అమరావతి చేరుకోబోతున్నారు. అనంతరం రేపు ఉదయం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో జగన్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు.
మంగళవారం రోజున ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. పెండింగ్ లో విభజన అంశాలకు సంబంధించిన విషయాలను మోడీతో చర్చించనున్నారు. పోలవరం టెండర్ల రద్దు, పీపీఏ ల విషయాలను ప్రధానికి వివరించనున్నారు. బుధవారం రోజున రాష్ట్రపతి కోవింద్ తో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)