ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ ..ఏంటంటే!

ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ ..ఏంటంటే!

రాష్ట్రం లో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం డాక్టర్లు, కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏపీలో కరోనా కట్టడికి డాక్టర్లు కలెక్టర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్న డాక్టర్లకు వారికి రిస్క్ ఉంటుందని తెలిసినా చాలా కస్టపడి వైద్యం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది హృదయపూర్వవికంగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మర్కజ్ యాత్రికులతోనే జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరందరిని పట్టుకుని టెస్టులు నిర్వహించామన్నారు. వారితోపాటు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయిన వారిని కూడా క్వారంటైన్ లో ఉంచామని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే త్వరలోనే రాష్ట్రం కోవిడ్  నుండి రక్షించబడుతుందని  ప్రజలకు తీపి కబురు చెప్పారు. కాగా ఇప్పటివరకు ఏపీలో మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు రాగా వారిలో ఆరుగురు కోలుకున్నారు.