జగన్ సంచలన నిర్ణయం  - అందకుంటే... రెండు ఒకేసారి...!!

జగన్ సంచలన నిర్ణయం  - అందకుంటే... రెండు ఒకేసారి...!!

రాష్ట్రంలో పెన్షన్ అందడం లేదని అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.  కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చినా.. పెన్షన్లు తీసేశారని ఫిర్యాదులు అందుతున్నాయి.  దీనిపై జగన్ ఇప్పుడు దృష్టి సారించారు.  అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తామని, వీలైనంత త్వరగా రీ వెరిఫికేషన్ పూర్తి చేసి పెన్షన్ అందని వారికి రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.  

ఈనెల 17 వ తేదీ నాటికి రేషన్ కార్డులను రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, 18 వ తేదీ వరకు వాటికి అప్ లోడ్ చేసి, 19, 20 వ తేదీల్లో సోషల్ అడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.  ఫిబ్రవరి 20 వ తేదీ వరకు తుదిజాబితాను ప్రకటించాలని, మార్చి 1 వ తేదీన కార్డులతో పాటుగా రెండు నెలల పెన్షన్ ను అర్హులైన వారికి ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు.  అదే విధంగా ఈనెల 24 వ తేదీన విజయనగరంలో జగనన్న వసతి దీవెన పేరుతో కొత్తపథకం అమలు చేయబోతున్నారు.  దీనిద్వారా ఉన్నత చదువులు చదుకునే వారికి అండగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు.