గత ప్రభుత్వ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటి నియామకం

గత ప్రభుత్వ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటి నియామకం

గత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పాలసీలు, ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐదుగురు మంత్రులు, ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, నీటిపారుదల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాలు, పాలసీలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటైన సంస్థలపై ఈ కమిటీ సమీక్ష చేయనుంది. దాదాపు 30 అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.