గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం జగన్

గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం జగన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ గేట్ వే హోటల్ లో బస చేసిన గవర్నర్ తో ఆయన సమావేశమయ్యారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. రెండు వారాల వ్యవధిలో గవర్నర్‌ విజయవాడ రావడం ఇది మూడో సారి.