అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ

అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై చర్చించినట్లు సమాచారం. గన్నవరం నుంచి ఢిల్లీకి చేరుకోగానే నేరుగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం జగన్ రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. శనివారం జరిగే వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.