రైల్వే కోడూరు ఎమ్మెల్యేకు జగన్ ఫోన్

రైల్వే కోడూరు ఎమ్మెల్యేకు జగన్ ఫోన్

రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం అందింది. దీంతో కోడూరులో అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పేషీ నుంచి పిలుపు అందడంతో హుటాహుటిన తన అనుచరులతో విజయవాడ బయలుదేరి వెళ్లారు. కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి నర్సింహాప్రసాద్‌పై శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ హయంలో 2009 ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2012, 2014 ఉప ఎన్నిక, తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ కొరుముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలుపొందారు.