ఒంగోలు ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా

ఒంగోలు ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా

ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరితగతిన నిందితులను అరెస్ట్‌ చేసినందుకు పోలీసు అధికారులను మెచ్చుకున్న సీఎం జగన్‌.. బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని హోం మంత్రిని ఆదేశించారు. దాంతో రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నామని హోం మంత్రి సుచరిత తెలిపారు. పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్‌ సూచించారు.