రాజధానిపై జగన్ సంచలన వ్యాఖ్యలు... 

రాజధానిపై జగన్ సంచలన వ్యాఖ్యలు... 

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై దుమారం కొనసాగుతోంది.  సీఆర్డీఏ బిల్లును, మూడు రాజధానుల బిల్లులను సెలక్ట్ కమిటీకి సిఫారసు చేసింది. శాసనమండలి ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి సిఫారసు చేయడంతో జగన్ దీనిని తీవ్రంగా ఖండించారు.  మండలి చట్టాలను అడ్డుకోవడంతో, అసలు ఇలాంటి మండలి అవసరమా అని జగన్ ప్రశ్నిస్తున్నారు.  రద్దు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జగన్ మంత్రులతో చర్చిస్తున్నారు.  అంతేకాదు శాసనసభలో జగన్ రాజధాని గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  

రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని అన్నారు.  సీట్ ఆఫ్ గవర్నెన్స్ అనే పదం మాత్రమే రాజ్యంగంలో ఉపయోగించారని, పరిపాలన కోసం సీట్ ఆఫ్ గవర్నెన్స్ ను డి సెంట్రలేషన్ చేసుకోవచ్చు అని అన్నారు.  జయలలిత అధికారంలో ఉండగా కొన్నాళ్ళు ఊటీ నుంచి ప్రభుత్వాన్ని నడిపినట్టు తెలిపారు.  అలానే హుదూద్ వచ్చినపుడు చంద్రబాబు విశాఖపట్నం నుంచి పరిపాలన చేసిన సంగతిని గుర్తు చేశారు.  ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలన చేసుకోవచ్చు అని జగన్ పేర్కొన్నారు.  దీనికి బిల్లుతో అవసరం లేదని, చట్టంతో పనిలేదని, సభలో తీర్మానం చేస్తే చాలు అని జగన్ చెప్పడం విశేషం.  ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచైనా చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని జగన్ చెప్పారు.