సీఎం హోదాలో తొలిసారి..

సీఎం హోదాలో తొలిసారి..

ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టును వైఎస్ జగన్ సందర్శించారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్‌కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్‌ పనులను జగన్‌ పరిశీలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రాజెక్ట్‌ పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు నిర్వాసితులు భారీగా తరలివచ్చారు.