వచ్చే వారంలో అమరావతి బాండ్లు

వచ్చే వారంలో అమరావతి బాండ్లు

ఏపీ రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్న 'అమరావతి బాండ్లు' జూన్‌ రెండో వారంలో ప్రభుత్వం విడుదల చేయనుంది. రూ. 2వేల కోట్లు విలువైన బాండ్లను విడుదల చేయనుంది ఏపీ సర్కార్. అయితే ఆర్బీఐ పాలసీ ప్రకటన తరువాత బాండ్లను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు తరహాలో.. అమరావతి పనులు వేగవంతంగా జరగడం లేదంటూ సీఎం  అసంతృప్తి వ్యక్తం చేసారు. అమరావతి ప్రధాన రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు ఆదేఆదేశించారు. అంతర్జాతీయ సంస్థ డస్సాల్‌ సిస్టమ్స్‌ అందజేసిన కొత్త టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని.. అండర్‌గ్రౌండ్‌ పైప్‌లైన్‌ పనులను త్రీడీ టెక్నాలజీతో అంచనా వేయవచ్చని అన్నారు. హైకోర్టు భవంతులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ తర్వాత 'అన్న క్యాంటీన్' నిర్మాణ ఆకృతులను పరిశీలించారు సీఎం చంద్రబాబు.