మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి

మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల అనంతరం 16 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలు తనను తీవ్రంగా కలిచివేసిందని ఓ ప్రకటనలో తెలిపారు. 'విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం ఒక్కడే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలు అర్ధంతరంగా ముగించడం బాధాకరం. మీ పై పెట్టుకున్న కన్నవారి ఆశలు కడతేర్చకండి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చకండి. ఓటమి విజయానికి నాంది. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. విజయం మీదే. బంగారు భవిష్యత్తు మీదే. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది' అని చంద్రబాబు తెలిపారు.