టీటీడీ పరిణామాలపై చంద్రబాబు సమీక్ష

టీటీడీ పరిణామాలపై చంద్రబాబు సమీక్ష

టీటీడీ పరిణామాలపై ఇవాళ సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తాజాగా తిరుమల ఆలయంలో జరిగిన వివాదాలు జాతీయ స్థాయికి చేరాయి. టీటీడీ సమస్య పరిస్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ పాలక మండలి చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ మరియు టీటీడీ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో గత కొన్నిరోజులుగా శ్రీవారి ఆలయం, నగల విషయంలో నెలకొన్న వివాదంపై  చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు రమణ దీక్షితులు తొలగింపు, తర్వాతి పరిణామాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్, ఈవో వివరించనున్నారు.