నాకు నాన్నలా సలహాలిచ్చారు..

నాకు నాన్నలా సలహాలిచ్చారు..

గవర్నర్ నరసింహన్ సేవలను కొనియాడారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఉమ్మడి గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పదవీకాలం ముగియడం, రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం కావడంతో విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ప్రభుత్వం వీడ్కోలు కార్యక్రమం నిర్వమించింది.. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరికొంత సమయం గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగిఉంటే బాగుండేదన్నారు. గవర్నర్‌కు వీడ్కోలు పలకడం ఓవైపు బాధగా ఉన్నా, మరోవైపు ఆయన మనతోనే ఉంటారన్న నమ్మకం ఉందన్న ఏపీ సీఎం.. నాన్నగారిలా నాకు అనేక సలహాలు ఇచ్చారు. నేను సీఎం అయ్యాక నన్ను ముందుండి నడిపించారని గుర్తుచేసుకున్నారు.