జగన్ సంచనల నిర్ణయం: ఉద్యోగులకు 27 శాతం ఐఆర్..

జగన్ సంచనల నిర్ణయం: ఉద్యోగులకు 27 శాతం ఐఆర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తొలి సారి స‌చివాల‌యంలో అడుగు పెట్టిన రోజే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లకు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి, సీసీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులకు వీలైనంతమందిని క్రమబద్దీకరించడం వంటి కీలకమైన అంశాలపై రేపటి కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధశాఖల ఉన్నతాధికారులను ఉద్దేశించి సచివాలయంలో మాట్లాడిన వైఎస్ జగన్... రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పారు. తాను ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఉద్యోగులు..పెన్ష‌న‌ర్ల‌కు 27 శాతం మ‌ధ్యంత భృతి ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మరోవైపు కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేసేందుకు కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌ని చేయాల‌ని సూచించారు. ఉద్యోగులు కొంద‌రు ప్ర‌భుత్వంతో స‌న్నిహితంగా ఉంటార‌ని.. అటువంటి వారిని తాను త‌ప్పు బ‌ట్ట‌న‌ని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల అండ దండ‌లు ప్ర‌భుత్వానికి ఉంటేనే తన ల‌క్ష్యాలు నెర‌వేర్చగ‌లుగుతామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు.