రివర్స్ టెండరింగ్.. ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం..

రివర్స్ టెండరింగ్.. ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం..

పాలనలో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రివర్స్ టెండరింగ్‌లో మరింత లబ్ధి కలిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్‌లో ఛాన్సివ్వాలన్నారు. మరింత పారదర్శకతతో పాటు పోటీని పెంచడానికే, ఎక్కువ ప్రజాధనం ఆదా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ. 10 లక్షల నుంచి రూ. 100 కోట్ల విలువైన టెండర్లకు రివర్స్ టెండరింగ్ జరపాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించాలని, శాశ్వతంగా ఉండేలా పాలసీ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారుల్ని ఆదేశించారు.