నేడు ఢిల్లీకి ఏపీ సీఎం...

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం...

ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.  ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.  ఈరోజు రాత్రి 9 గంటలకు సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు.  ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించే అవకాశం ఉన్నది.  అమిత్ షాతో భేటీ తరువాత జగన్ అనేక మంది కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసే అవకాశం ఉన్నది.  రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనా, అందవలసిన నిధులపైన మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే ఏపీ సీఎం ఢిల్లీకి పయనం కావడం ఆసక్తికరం.