మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం.. హస్తినలో రెండు రోజుల పాటు మకాం..

మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం.. హస్తినలో రెండు రోజుల పాటు మకాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి హస్తినలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ఏపీ సీఎం. విభజన హామీలు, కేంద్ర నిధులు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. సోమవారం ఉదయం గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తారు సీఎం జగన్‌.  హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లతో సమావేశమవుతారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంపై గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో చర్చిస్తారు. రెవెన్యూ లోటు, కేంద్ర నిధులపై నిర్మలా సీతారామన్‌తో మాట్లాడతారు. విభజన అంశాలపై హోంమంత్రి అమిత్‌షాను కలిసి చర్చిస్తారు సీఎం జగన్‌. ఎల్లుండి మధ్యాహ్నం వరకూ ఢిల్లీలోనే ఉంటారు ముఖ్యమంత్రి.