కాఫర్‌ డ్యామ్‌ పనులపై సీఎం జగన్ అసంతృప్తి..

కాఫర్‌ డ్యామ్‌ పనులపై సీఎం జగన్ అసంతృప్తి..

సీఎం హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టు, పనుల పురోగతిని పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుచూపు లేకుండా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని అధికారులకు సూచించిన సీఎం జగన్... కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాక పోవడంతో వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన ఏ పనులూ జరిగే అవకాశం లేకపోవడంపై అసంతృప్తి చెందారు. ఇక హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న సీఎం జగన్... ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్‌ను పరిశీలించారాయన. కాఫర్‌ డ్యామ్‌, సాంకేతిక అంశాలపై అధికారులను లోతుగా ప్రశ్నించారు.