టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం..

టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం..

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు అవకాశం ఇచ్చే అంశంపై నిబంధనలు చదివి వినిపించారు సీఎం జగన్... ప్రతిపక్షంలోకి వచ్చినా టీడీపీ తన వైఖరి మార్చుకోవడంలేదని మండిపడ్డ ఆయన.. ప్రతీ దానికీ నేర్చుకోమంటూ ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. నిబంధనల ప్రకారమే సభను నడుపుతున్నాం. ఒకసారి సభకు వచ్చినా.. ఆరు సార్లు సభకు వచ్చినా.. నిబంధనలు ఒకటేనని స్పష్టం చేసిన వైఎస్ జగన్... ఆరుసార్లు సభకు వచ్చిన వారికి వేరే నిబంధనలు వర్తించవు కదా? అని ప్రశ్నించారు. మేం ప్రతిపక్షంలో ఉండగా.. మీకు మూడింతల బలంతో ఉన్నాం. మాకు ఆనాడూ ఏ మాత్రం అవకాశం ఇవ్వకున్నా.. మేం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి అవకాశం కల్పిస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్.