ఎమ్మెల్సీ అభ్యర్థులపై జగన్ కసరత్తు.. రేస్‌లో ఉంది వీరే..!

ఎమ్మెల్సీ అభ్యర్థులపై జగన్ కసరత్తు.. రేస్‌లో ఉంది వీరే..!

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.. మంత్రి మోపిదేవి వెంకటరమణ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. మైనార్టీ కోటాలో హిందూపురం నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ ఇక్బాల్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, మూడో సీటు కోసం మర్రి రాజశేఖర్, పండుల రవీంద్ర, ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి పోటీపడుతున్నారు. అయితే, సంఖ్యాపరంగా ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీయే దక్కించుకోనుంది.