ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త

ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త

నవంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమౌతున్న వారికి ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు నెలకు 16 వేల రూపాయల జీతం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీని జనవరిలో ప్రారంభించాలని జగన్ అధికారులకు సూచించారు.

డిసెంబర్ 21న ఆరోగ్యకార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం డిసైడైంది. నెలకు ఐదు వేలు లేదా రోజుకు 225 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ కు ఆరు సూత్రాలతో ముందుకు సాగుతామన్నారు జగన్. అలాగే వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలన్న జగన్, డిసెంబర్‌ 21న ఆరోగ్యకార్డుల జారీ చేయాలని ఆదేశించారు.

ఇక ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లకు రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని కూడా జగన్ ఆదేసించారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి  రూ.10వేల వర్తింపు చేయాలని జగన్ అధికారులకు సూచించారు.  జనవరి 1 నుంచి ప.గో.లో 2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్య శ్రీ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు చేయాలనీ, డెంగూ, సీజనల్‌ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలని పేర్కొన్నారు.