షాతో ముగిసిన జగన్ భేటీ.. గంటపాటు కీలక చర్చలు..!

షాతో ముగిసిన జగన్ భేటీ.. గంటపాటు కీలక చర్చలు..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.. సుమారు గంటపాటు షాతో కీలక చర్చలు జరిపారు ఏపీ సీఎం... ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపైనే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సవరించిన అంచనాలను ఆమోదించాల్సిందిగా కోరినట్టు సమాచారం.. వరుస తుఫాన్లతో నష్టపోయిన ఏపీకి వరద సాయాన్ని విడుదల చేయాలని కోరారు.. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై కూడా అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్‌ చర్చించినట్టు తెలుస్తుండగా... ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే మకాం వేయనున్న ఏపీ సీఎం.... రేపు మరికొంతమంది కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు.. కేంద్రాన్ని ఇబ్బంది పెడుతున్న అంశం.. రైతుల ఆందోళన.. సామరస్యపూర్వంగా ఈ ఆందోళనను విరమింపజేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దాని కోసం రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.. మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ నుంచి కూడా రైతుల ఆందోళనపై అభిప్రాయాన్ని తీసుకున్నారని.. ఇవాళ జగన్‌ అభిప్రాయం కూడా తెలుసుకున్నారని టాక్.