పోలవరానికి రండి.. కేంద్రమంత్రికి జగన్‌ ఆహ్వానం..

పోలవరానికి రండి.. కేంద్రమంత్రికి జగన్‌ ఆహ్వానం..

ఢిల్లీలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రెండో రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు.. గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో అరగంట పాటు చర్చలు జరిపిన ఏపీ సీఎం.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2021 చివరి నాటి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు అందించాలని కోరారు. అదే విధంగా.. పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రిని కోరారు ఏపీ ముఖ్యమంత్రి.. దీంతో.. త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానన్న జలశక్తి మంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. గోదావరి -  కావేరి నదుల అనుసంధానంపై కూడా ఈ భేటీలో చర్చించారు. నదుల అనుసంధానం అంశంపై అధ్యయనం కోసం రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్ కు సూచించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.