గంజాయి ఏరివేతకు భారీ ఆపరేషన్

గంజాయి ఏరివేతకు భారీ ఆపరేషన్

గంజాయి సాగు, సరఫరాను కట్టడి చేయడంపై ఉండవల్లిలోని ప్రజావేదికలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి ఉత్పత్తిదారులకు జీవనభృతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఆయన.. కాఫీ ప్లాంటేషన్ ప్రోత్సహించడం ద్వారా గంజాయి ఉత్పత్తిదారులకు ఆదాయమార్గం చూప్పొచ్చన్నారు. ఇక, గత ప్రభుత్వంలో అధికారుల ప్రోత్సాహంతోనే గంజాయి ఉత్పత్తి పెరిగిందని మంత్రి బొత్స ఆరోపించారు. అయితే, మంచి అధికారులను నియమించి.. గంజాయి సాగును అరికట్టాలని... గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ ఆపరేషన్ చేపట్టనున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గంజాయి సాగుచేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.