లిక్కర్ బ్యాన్‌పై సీఎం జగన్ మరికొన్ని కీలక నిర్ణయాలు..

లిక్కర్ బ్యాన్‌పై సీఎం జగన్ మరికొన్ని కీలక నిర్ణయాలు..

మద్య నిషేధం విషయంలో మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అమరావతిలోని ప్రజావేదికలో రెండో రోజు కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... అక్టోబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాప్ లేకుండా చేయాలని ఆదేశించారు. మద్యపాన నిషేధం విషయంలో గతంలో తానిచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందేనన్నారు. మరోవైపు హైవేల వెంబడి మద్యం షాపులు వద్దని.. దాబాల్లో లిక్కర్‌ అమ్మకుండా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. కాగా, తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.