వైసీపీఎల్పీలో సీఎం జగన్ సంచలన ప్రకటనలు

వైసీపీఎల్పీలో సీఎం జగన్ సంచలన ప్రకటనలు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా హాజరైన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గైరన జగన్... ఇక మొత్తం 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సంచనల ప్రకటన చేశారు. తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎవరూ అసంతృప్తి చెందొద్దని సూచించిన సీఎం జగన్.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామంటో పరోక్షంగా వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత. కాగా, రేపు 20 మంది మంత్రులతో పాటు, ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, మంత్రులు ఎవరు? డిప్యూటీ సీఎంలు ఎవరు? అనే దానిపై ఏమీ చెప్పకుండా..? తాను ఎలా ప్రాధాన్యత ఇవ్వదల్చుకున్నాను.. మంత్రివర్గ కూర్పుకు సంబంధిచిన విషయాలను ఎమ్మెల్యేలకు వివరించారు.