'పెద్దల సభలో తెలుగు పెద్ద' ఆవిష్కరణ..

'పెద్దల సభలో తెలుగు పెద్ద' ఆవిష్కరణ..

జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన దివంగత డాక్టర్ సి.నారాయణ రెడ్డి పార్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... తాడేపల్లిలోనీ సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. కాగా, రాజ్యసభ పూర్వ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైస్ జగన్‌ను సన్మానించారు యార్లగ్డ లక్ష్మీప్రసాద్.