ప్రాజెక్టుల్లో అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణ..

ప్రాజెక్టుల్లో అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణ..

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రాజెక్టుల్లో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు థర్డ్ పార్టీ విచారణకు నలుగురు నిపుణుల కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీలో మాజీ ఈఎన్‌సీబీ రోశయ్య, నారాయణరెడ్డి, నాక్ డైరెక్టర్ పీటర్, ఐఐటీ ప్రొఫెసర్ రమణకు చోటు కల్పించారు. కమిటీ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రేపు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇక, నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ప్రాజెక్టులవారీగా సమావేశాలు నిర్వహించనుంది. ప్రాజెక్టు అంచనా వ్యయాలు, ఖర్చులు తదితర అంశాలపై ఆరా తీయనుంది. మూడు నెలల్లో థర్డ్ పార్టీ కమిటీ... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దాదాపు 25 ప్రాజెక్టుల్లో రూ.55 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు నిపుణులు.