రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వై.ఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలుస్తారు. ఆయనతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ నుంచే బుధవారం.. తిరుమలకు చేరుకోనున్నారు సీఎం జగన్.