నేటి నుంచి ఏపీలో మరో రెండు పథకాలు..!

నేటి నుంచి ఏపీలో మరో రెండు పథకాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి మరో రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి... ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇవాళ వైఎస్‌ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం "రైతు దినోత్సవం"గా నిర్వహిస్తోంది. ఇదే వేదికపై "వైఎస్ఆర్‌ పెన్షన్‌ పథకం" కూడా తీసుకురానున్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. రైతులకు పెట్టుబడి సాయానికి సంబంధించిన వివిధి విధానాలను ప్రకటించడంతో పాటు.. పెన్షన్‌కు సంబంధించిన కార్యాచరణను కూడా వెల్లడిస్తారు సీఎం వైఎస్ జగన్.
* ఉదయం 8.10 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోన్న సీఎం జగన్.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు వెళ్తారు.
* ఉదయం 8.35 నుంచి 9.10 వరకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులర్పించి ప్రార్థనలు నిర్వహిస్తారు.
* ఉదయం 9.15 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి గండి క్షేత్రానికి వెళ్లనున్న సీఎం.
* ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం, పూజలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.
* ఉదయం 10.15 గంటలకు తిరిగి ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టరులో జమ్మలమడుగులోని కన్నెలూరుకు జగన్. 
* ఉదయం 10.45 గంటలకు జమ్మలమడుగు రైతు సదస్సుకు సీఎం.
* ఉదయం 10.55 నుంచి 11.55 వరకు వ్యవసాయ శాఖ, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ల సందర్శన.
* ఉదయం 11.15 నుంచి 1.15 గంటల వరకు రైతు దినోత్సవంలో  పాల్గొననున్న సీఎం. 
* మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నెలూరు హెలిప్యాడ్‌ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు హెలిక్యాప్టరులో పయనం
* మధ్యాహ్నం 1.50 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.