తొలిసారి పోలవరం ప్రాజెక్టుకు సీఎం జగన్..

తొలిసారి పోలవరం ప్రాజెక్టుకు సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు... మూడు గంటల పాటు సీఎం జగన్ పోలవరం పర్యటన కొనసాగనుంది. క్షేత్రస్థాయిలో తొలి సారి పనులు పరిశీలించనున్న సీఎం... పోలవరంలో ఇరిగేషన్ పనులతో పాటు పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజలకు పరిహారం ఇవ్వకుండా నీళ్లు నిలపడం సరికాదనే అభిప్రాయంలో జగన్ సర్కార్ ఉంది. ఇరిగేషన్ పనులు - పునరావాసం పనులు సమాంతరంగా జరగాలంటున్న వైసీపీ ప్రభుత్వం... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ పరిహారంలో అవకతవకలు జరిగాయన్న భావనలో ఉంది. పోలవరం కేంద్రానికి అప్పగించాలా...? రాష్ట్రం ద్వారానే నిర్మాణం చేపట్టాలా? అనే అంశంపై కూడా విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక, పోలవరం కాంట్రాక్టర్‌ల విషయంలో సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలవరం అంచనాల పెరుగుదలపైనా ప్రత్యేక దృష్టి పెట్టనుంది జగన్ సర్కార్. సీఎం జగన్‌ పర్యటనకు ఒక రోజే ముందే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు అనిల్ కుమార్, ఆళ్ల నాని... సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు... ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై ఆరా తీశారు.