హైకోర్టుకు జగన్.. సీబీఐకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన సీఎం..

హైకోర్టుకు జగన్.. సీబీఐకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన సీఎం..

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో క్రమం తప్పకుండా సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. దీంతో, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ప్రతీసారి పిటిషన్ దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇక, తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసిన తర్వాత.. ఒకసారి వ్యక్తిగతంగా హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆ తర్వాత మళ్లీ ఆయన తరపు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం హైకోర్టును ఆశ్రయించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. సీబీఐ కేసుల్లో హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని పిటిషన్‌లో పేర్కొన్న ఆయన.. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయన్న కారణంగా హాజరు మినహాయింపు నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు.